బీహార్ ఎన్నికల్లో ఓటమిపై జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో నిజాయతీగా ప్రయత్నించామని.. కానీ విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమికి వందశాతం బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాగా, 243 సీట్లకు గానూ 238 స్థానాల్లో పోటీ చేసిన పీకే పార్టీ అన్ని చోట్ల పరాజయం పొందింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు.