NZB: దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. ఏక్ భారత్ ఆత్మనిర్బార్ భారత్ కార్యక్రమంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు యూనిటీ మార్చ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో గల పటేల్ విగ్రహం నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు రన్ కొనసాగించారు.