GDWL: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకంలో నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందనీయకుండా చేస్తుందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం కే.టీ.దొడ్డి మండలం నందిన్నె జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గదులు, ఉపాధ్యాయుల కొరతను అధికారులు స్పందించి త్వరగా పరిష్కరించాలన్నారు.