HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని కొందరి బైక్స్‌లో ఇంజిన్ వేడెక్కడం, పొగ రావడం వంటి సమస్యలతో ఈగుట్టు రట్టయింది. నకిలీ ఆయిల్ వాడితే బైక్‌లు, కారులు త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా వస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన చోటనే సర్వీసింగ్ చేయించుకోవాలని, ఆయిల్ కొనాలని చెప్పారు.