అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో గాలివీడు మండలానికి చెందిన ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గాలివీడుకు చెందిన నాగన్న గుట్టపాలెం సమీపంలో ఉంటున్న చంద్రశేఖర్, రెడ్డి శేఖర్లు 2015న పెద్దమండ్యం పోలీసులకు పట్టుబడి అరెస్టు అయినట్లు తెలిపారు. అనంతరం వారికి ఇవాళ శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.