NRML: లోకేశ్వరం మండలంలోని రాజుర, మన్మద్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు విధానం, వసతులను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ట్యాబ్ ఎంట్రీలు, రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.