సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని రైతులకు 100 ఆవులను ఉచితంగా అందజేస్తామని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రకటించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చే ఈ ఆవులు రోజుకు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయని తెలిపారు. రైతులకు పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక చేయూత అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.