BHNG: డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు.