NDL: వెలుగోడు రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఇవాళ చేప పిల్లలను విడుదల చేశారు. 21 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి వీర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చేప పిల్లల విడుదల ద్వారా మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. ప్రభుత్వ సహాయంతో మత్స్య పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.