TG: మావోయిస్టుల ఎన్కౌంటర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘తుపాకీతో ఏమీ సాధించలేరు.. లొంగిపోవాల్సిందే. తుపాకీ ఉండాల్సింది జవాన్ల, పోలీసుల దగ్గర. ఇంకెవరి దగ్గర తుపాకీ ఉన్నా కేంద్రం ఉపేక్షించదు. చిన్నారుల చేతికి తుపాకులు ఇచ్చారు. మావోయిస్టులు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి. ప్రజాసమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి’ అని అన్నారు.