సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. నిద్రలేమి వల్ల గిల్ మెడ కండరం పట్టేసిందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరించాడు. దీంతో అతడు రెండో టెస్టులోనూ ఆడేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు వహించే అవకాశముంది. అయితే, దీనిపై BCCI నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.