మాజీ ప్రధాని హసీనాకు ICT ఉరిశిక్షను ఖరారు చేయడంతో బంగ్లాలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హసినా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించి, ఇతర నివాసాలు, దుకాణాల పైకి రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.