డెఫ్లింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్ అనుయ ప్రసాద్ సత్తా చాటింది. ఫైనల్లో అనుయ 241.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఇది డెఫ్లింపిక్స్ ఫైనల్ ప్రపంచ రికార్డు. ఇదే విభాగంలో ప్రాంజలి రజతం సాధించింది. మరోవైపు పురుషుల విభాగంలో అభినవ్ దేశ్వాల్ రజతం గెలుచుకున్నాడు.