KDP: ఖాజీపేట మండల త్రిపురవరం గ్రామ పంచాయతిలో ‘స్వామిత్వ’ మీద అధికారులు ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామకంఠంలోని గృహాలకు 9 (2), PPMS అందజేసి అందులో ఉన్న కొలతలు వ్యత్యాసం ఉంటే సరిచూసుకోవాలన్నారు. ఈ సభలో డివిజనల్ అభివృద్ధి అధికారి మైథిలి, ఖాజీపేట ఎంపీడీవో దివిజా సంపతి తదితరులు పాల్గొన్నారు.