ADB: డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ మిషన్ పరివర్తన దివస్ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలన్నారు. భారత దేశాన్ని నషాముక్త్ భారత్ చేయుటకు సంకల్పంతో చేయాలని పిలుపునిచ్చారు.