ATP: ఆంధ్ర ప్రాంతంలోని నాలుగు జిల్లాల (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ప్రాంతానికి రాయలసీమగా నామకరణం చేసి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యింది. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన సభలో ఈ ప్రాంతానికి చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఈ పేరు పెట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లోని ప్రజలు ఆనాటి చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.