అన్నమయ్య: పీలేరు అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగిరి సాంబశివ మాట్లాడుతూ.. జిల్లాలో దళితులు, మహిళలు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమానత్వ సాధన కోసం రాష్ట్రంలో కులగణన తప్పనిసరి అని డిమాండ్ చేశారు.