MDK: ఏసీబీ అధికారులకు ఎస్సై పట్టుబడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో హార్వెస్టర్‌పై నమోదైన ఓ కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.20,000 డిమాండ్ చేశాడు. ఇవాళ బాధితుని వద్ద నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.