E.G: కొవ్వూరు మండలం దేచర్ల గ్రామంలో RWS శాఖ PMAGY గ్రాంట్ ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న CC డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇవాళ శంకుస్థాపన చేసారు. గ్రామంలో శుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.