NRML: నిర్మల్ జిల్లాలో డిసెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం జరుగుతుందని డీఈవో భోజన్న, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.