TG: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జల్ శక్తి మంత్రి CR పాటిల్ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రానికి 6 అవార్డులు వచ్చాయి. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో రాష్ట్రానికి అగ్రస్థానం రాగా.. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ కమిషనర్ సృజన అవార్డు అందుకున్నారు.