2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని కేంద్రమంత్రి అమిత్ షా గడువు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో ఈ నెల 30లోగా హిడ్మాను అంతం చేయాలని బలగాలను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, డెడ్ లైన్ కన్నా ముందే జరిగిన కాల్పుల్లో హిడ్మా మృతి చెందడం విశేషమని తెలిపాయి.