గుజరాత్ అర్వల్లి జిల్లా మెడసాలో అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వైద్యులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు శిశువు, తండ్రి జిగ్నేష్, వైద్యుడు శాంతిలాల్ రెంటియా, నర్సు మనత్ ఉన్నారు. ఈ ఘటనలో వారంతా సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ సహా మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడి గాయాలతో చికిత్స పొందుతున్నారు.