జేడీయూ 25 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని తను చేసిన వ్యాఖ్యలపై జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ప్రస్తుతం తను ఏ పదవిలో లేనని.. కాబట్టి ఏ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. బీహార్‌ను వదిలి వెళ్తానని తను ఎప్పుడూ చెప్పలేదని.. రాజకీయాలు చేయనని మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు.