శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర బ్రెయిన్ ఫీవర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపింది. వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొంది. నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకోవాలని సూచించింది.