KNR: శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగ మంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని చూపించారు.