MBNR: జిల్లా పురపాలక పరిధిలోని వీరన్నపేట వార్డులో ఆరవ విడతలో 400 నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంజూరు అయినట్టు వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లీడర్ రఘు వెల్లడించారు. మంగళవారం నూతన కార్డులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.