నిజామాబాద్ జిల్లాలోని చందూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.