NGKL: సీఎం సహాయనిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను బుధవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో బాధితులకు అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.