MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ఒడి బియ్యం, పూలమాలలతో, ధూపదీప నైవేద్యాలతో, అభిషేకాలు నిర్వహించారు. అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి బారీగా భక్తులు తరలివచ్చారు.