KNR: సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్య లను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో వారి నిరంతర శ్రమ ప్రశంసనీయమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్లో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆయన శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.