VZM: జిల్లా జడ్జి బబిత ఆమె ఛాంబర్లో బుధవారం పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 13న (రెండవ శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. అలాగే సాధ్యమైనంత ఎక్కువ ఎక్సైజ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు.