కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ సమీపంలో అపచారం జరిగింది. క్యూ వివరాలు అడిగినందుకు కేరళకు చెందిన ఓ పోలీస్ అధికారి ప్యాంటు జిప్ ఓపెన్ చేసి అసభ్యకర సైగలు చేశాడని ఆరోపిస్తూ ఏపీ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భక్తులు ఆందోళనకు దిగారు. ఇతర సిబ్బంది జోక్యం చేసుకుని ఆ అధికారిని అక్కడి నుంచి పంపించగా, భక్తులు ఆ పోలీసుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.