మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడని, టీమిండియాతోపాటు గౌహతికి వెళ్తాడని BCCI తెలిపింది. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, సౌతాఫ్రికాతో ఈ నెల 22 నుంచి జరిగే 2వ టెస్టులో ఆడతాడో లేదో అప్పటి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుందని పేర్కొంది. కాగా తొలి టెస్ట్ 2వ రోజు గిల్ మెడ నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.