ADB: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎంపీ, రాంజీ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు బాపురావును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి ఎన్నికలపై చర్చించినట్లు పేర్కొన్నారు.