KNR: పోలీసు శాఖలో విధులు నిర్వహించే వారికి శారీరక ధృడత్వంతో పాటు మానసిక ధృడత్వం కూడా అవసరమని సీపీ గౌష్ ఆలం అన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడే ప్రజలను సమర్థవంతంగా రక్షించగలం అని ఉద్ఘాటించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో సుమారు 100 మంది మహిళా పోలీసులకు (షీ టీమ్స్ సభ్యులతో ) రెండు దశల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.