SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కుమహిళ అన్నారు.