ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో అనేక సంస్కరణలు ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయన్నారు.