TG: iBomma రవిని విచారించేందుకు పోలీసులకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, రవిని 5 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని వెబ్సైట్ నెట్వర్క్, యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయం, ఇతర వ్యక్తుల వివరాలపై లోతుగా ఆరా తీయనున్నారు.