ASF: జిల్లాలో బాలల కోసం సినిమా థియేటర్లలో పిల్లల చిత్రాల ప్రత్యేక ప్రదర్శన చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11గంటల వరకు జిల్లాలోని సినిమా థియేటర్లలో పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక చిత్ర ప్రదర్శనలు ఉంటాయన్నారు. గ్రామాలలో రూ.25, పట్టణ ప్రాంతాలలో రూ.30గా టికెట్ ధర నిర్ణయించమన్నారు.