NZB: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి విభాగానికి సంబంధించిన అన్ని అంశాలలో నాణ్యమైన పురోగతిని సాధించేందుకు కార్యదర్శులందరూ సమన్వయంతో పనిచేయాలని సాలూర మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సూచించారు. సాలూర మండల కేంద్రంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.