EG: రాజమండ్రి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మధురపూడి నుంచి దివాన్ చెరువు, పుణ్యక్షేత్రం, వేమగిరి మీదుగా కడియం వరకు ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.