కాకినాడ: యు.కొత్తపల్లి మండలంలోని సుబ్బంపేటకు చెందిన 15 ఏళ్ల బాలికకు వివాహం కాలేదు. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భిణి. దాంతో బుధవారం జీజీహెచ్‌లోని గైనిక్ వార్డులో చేర్చారు. సంబంధిత వైద్యులు జీజీహెచ్ అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. తెలిసిన వ్యక్తి ఆమెను మాయమాటలతో మోసం చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.