ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. అక్కడ AQI పాయింట్లు ఏకంగా 500 మార్కును దాటాయి. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది. గాలిలో దుమ్ము, ధూళి కణాల శాతం గణనీయంగా పెరగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు గ్రాప్-3 చర్యలను అమలు చేస్తున్నారు. ఈ చర్యల్లో నిర్మాణ పనులు ఆపడం, డీజిల్ వాహనాల నియంత్రణ వంటివి ఉంటాయి.