PLD: వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్జీలు అందించే వారు తమ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్‌ను జత చేసి అందించాలని సూచించారు.