KMM: నాణ్యత పరిశీలించిన ధాన్యానికి రైస్ మిల్లుల వద్ద కోతలు విధించవద్దని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లపై బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో పాటిస్తున్న విధానాన్నే పత్తి కొనుగోలుకు కూడా పాటించాలన్నారు. గ్రామాల్లోనే తేమ శాతం చూడాలని సూచించారు.