NLG: మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ షమీమ్ అక్తర్ నేడు నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయంలో ఉదయం 11:30 కు జరిగే అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.