HYD: మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 10:30 గంటలకు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టు పరిధిలో ట్రాఫిక్ భారీగా ఉండే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో 9010203626 నంబరుకు కాల్ చేయాలని సూచించారు.