ADB: ఢిల్లీలో బుధవారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సోషల్ జస్టిస్ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ పీ.సీ. మోహన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా సామాజిక న్యాయం, సాధికారిత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తదితరాంశాలపై చర్చించినట్లు ఎంపీ నగేశ్ పేర్కొన్నారు.