తెలుగు అయ్యప్ప స్వామిని పోలీస్ అధికారి అవమానించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. శబరిమల భక్తుల విషయంలో కేరళ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆలయం వద్ద నీరు, శుభ్రత లోపించాయని, నేలపై లైవ్ కేబుల్స్ ఉన్నాయని, క్యూ లైన్లు 15 గంటలు దాటుతున్నాయని ఆయన ఆరోపించారు. దేవాలయ బోర్డు, LDF ప్రభుత్వం ప్రాథమిక ఏర్పాట్లను కూడా విస్మరించాయని దుయ్యబట్టారు.